రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ముగ్గురు గిరిజన విద్యార్థుల ఎంపిక

కలం, నిర్మల్ రూరల్ : ఈనెల 28, 29, 30 తేదీల్లో ఉట్నూర్ మండలం అల్లంపల్లిలోని చిన్న జీయర్ గురుకులంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు (Archery Competitions) నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌-14, అండర్‌-16 విభాగాల్లో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రంజిత్ సింగ్, కరణ్, అంబాజీలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంత విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుష, పీఈటీ వందన, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>