తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లను అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ తాకట్టుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా నదిలో 811 టీఎంసీల నీళ్లు ఉంటే తెలంగాణకు 299 టీఎంసీలు చాలు.. 512 టీఎంసీలను ఆంధ్రాకు తీసుకుపోమని కేసీఆర్, హరీశ్ రావు సంతకము పెట్టారని విమర్శించారు. అప్పటి వైసీపీ మంత్రి రోజా వడ్డించిన రొయ్యల పులుసుతిని రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని తెలిపారు. ఏపీ నీళ్లు తీసుకెళ్తుంటే.. వైఎస్ జగన్‌కు కేసీఆర్ గులాంగిరి చేశారని ఆరోపించారు. ఆనాడు 33 శాతం నీళ్లుచాలని మామ, అల్లుళ్లు మరణశాసనం రాశారని కేసీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్‌కు మామ, అల్లుళ్లు కలిసి దోచిపెట్టారని ఫైర్ అయ్యారు.

మాజీ మంత్రి కేటీఆర్ కు గడ్డం రావడానికే 50 ఏళ్ళు పట్టిందని.. ఆయనకు బుద్ది రావడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందోనని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. 8 లక్షల ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు తామే ఇచ్చామని అన్నారు. తన రక్తంలో తెలంగాణ పౌరుషం ఉందని సీఎం స్పష్టం చేశారు.

నిజాం రాజు కంటే ధనవంతుడిగా కేసీఆర్ మారారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ఆగర్భ శ్రీమంతుడిలా అయ్యారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో తనెక్కడా వివక్ష చూపించడం లేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల ప్రతినిధులకు నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>