రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీల్లో నిర్మల్ విద్యార్థినుల ప్రథమ స్థానం

కలం, నిర్మల్ : హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ జనాభా విద్య విభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద బృంద నృత్య పోటీల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో గల తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు (Nirmal Gurukul Girls) ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులు, రాష్ట్రస్థాయిలోనూ అద్భుత ప్రదర్శనతో విజేతలుగా నిలిచారు.

దీంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థినులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్, జిల్లా కోఆర్డినేటర్ నరసయ్య విద్యార్థినులను అభినందించారు. జాతీయస్థాయిలోనూ విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>