వంటగదిలో వింత శబ్దాలు.. చూస్తే భారీ కొండచిలువ!

కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో అర్ధరాత్రి భారీ కొండచిలువ(Giant Python) కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోని వంటగది నుంచి వింత శబ్దాలు వినిపించాయి. తొలుత ఇంట్లోకి పిల్లి వచ్చి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత కూడా పదేపదే శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చి నిద్రలేచి పరిశీలించగా.. వంటగది కిటికీ సమీపంలో భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన బ్లూకోట్‌ సిబ్బంది అనిల్‌, రాజేంద్ర ప్రసాద్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో కొండచిలువ ఉన్న విషయాన్ని గుర్తించి స్నేక్‌ క్యాచర్‌ అష్టల్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఇంటి పరిసరాల్లో పాములు కనిపిస్తే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ క్యాచర్ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>