మెంటార్‌గా ధోనీ.. ఈజీ కాదంటున్న సీనియ‌ర్‌!

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni), 2027 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అయితే, మైదానంలో ఉండి జట్టును నడిపించడం కంటే, బయట కూర్చుని ఆటగాళ్లను నడిపించడం ధోనీకి కఠినమైన పరీక్షే అవుతుందని భారత మాజీ ఆల్ రౌండర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ధోనీ మెంటార్ పాత్రను ఎంచుకోవడం సరైన నిర్ణయమే అయినా, అది సవాలుతో కూడుకున్నదని ఆయన ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

గతంలో మైదానంలో ఉండి స్వయంగా నిర్ణయాలు తీసుకునేవాడని, ఇప్పుడు బయట కూర్చుని ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందని అన్నారు. జట్టు గెలుస్తున్నంత వరకు బాగానే ఉన్నా, కష్టాల్లో పడినప్పుడు బయట ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ధోనీకి అసహనం కలిగించవచ్చని విశ్లేషించారు.మరోవైపు, ధోనీకి మెంటార్ పాత్ర కొత్తేమీ కాదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడే ఎంతోమంది ఆటగాళ్లను ధోనీ తీర్చిదిద్దాడని గుర్తుచేశారు. ఆటగాడిగా ప్రయాణం ముగిసినా, క్రికెట్‌కు అతని సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>