మాగ్నస్ కార్ల్‌సన్ షాకింగ్ నిర్ణయం.. గేమ్‌కు డుమ్మా!

క‌లం, స్పోర్ట్స్: ప్రపంచ నంబర్ వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ (Magnus Carlsen) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న టోటల్ చెస్ టోర్నీలో బిబిసారా అసౌబయేవాతో చివరి గేమ్ ఆడేందుకు నిరాకరించాడు. అప్పటికే 11.5-0.5 ఆధిక్యంతో మ్యాచ్‌ను గెలుచుకోవడంతో బోర్డు వద్దకు రాలేదు. దీంతో బిబిసారా 15 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కార్ల్‌సన్ ఇప్పటికే 21.8 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతడి రేటింగ్ 2801.2గా ఉంది. మరో గేమ్ ఆడితే రేటింగ్ మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఫోర్‌ఫిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా చేయడం వల్ల ఆ గేమ్‌కు సంబంధించిన రేటింగ్ నష్టం తప్పింది. మ్యాచ్ ఫలితం తేలిపోయిన తర్వాత చివరి గేమ్ ఆడాల్సిన అవసరం లేదని కార్ల్‌సన్ (Magnus Carlsen) సమర్థించుకున్నాడు. అయితే, అన్ని గేమ్స్ ఆడాల్సిందేనని తమకు ముందుగా చెప్పారని ఇతర ఆటగాళ్లు తెలిపారు. కార్ల్‌సన్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బుధవారం మళ్లీ బిబిసారాతో కార్ల్‌సన్ తలపడనున్నాడు. ఈసారి అతడు అన్ని గేమ్స్ ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>