ఐక్యతే మన బలం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో పంచాయతీ, మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న వేళ సీఎం చంద్రబాబు (Chandrababu) టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి శ్రేణులు ఐక్యంగా పరిచేయాలని సూచించారు. ఈ మేరకు ఐక్యతే మన బలం.. ఒక కూటమి, మూడు పార్టీలు ఇదే మన విధానమని అభివర్ణించారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, క్షేత్రస్థాయిలోనూ సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

కూటమి పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ ముఖ్యమని.. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే ఫలితాలు ఇంకా మెరుగవ్వాలని సూచించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి శ్రేణులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో ఏ ఒక్క వార్డులో ఓడినా ఎందుకు ఓడిపోయోమో విశ్లేషిస్తానని చెప్పారు.

మరోవైపు కూతురు వివాహానికి రావాలని షర్మిల తనకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం దినపత్రికలో ‘చెట్టపట్టాల్’ అంటూ శీర్షికతో వార్త ప్రచురించడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తల్లిని, చెల్లిని అగౌరపరిచేవారు రాజకీయ ముసుగులో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వం లేకుండా తల్లి, చెల్లిని అగౌరపరిచేవారు రాజకీయాలకు అనర్హులని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్న అతనిపై, ఆ పార్టీపై ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>