బుగ్గారం రైతుల కల సాకారం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

కలం, జగిత్యాల: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరీ నర్సాగౌడ్ అన్నారు. బుగ్గారం (Buggaram) మండల రైతుల చిరకాల కోరిక నెరవేరిందని, బుగ్గారంకు ప్రత్యేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మంజూరు కావడంతో మండల వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ల చిత్రపటాలకు నాయకులు గురువారం బుగ్గారం చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. బుగ్గారం రైతుల చిరకాల కోరిక అయిన సొంత సహకార సంఘం ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ఇతర సంఘాలపై ఆధారపడిన మన రైతులకు ఇక సొంత సంఘం ద్వారా పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు నేరుగా అందుతాయని తెలిపారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మండల రైతులు, నాయకుల ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉంటామని నర్సాగౌడ్ స్పష్టం చేశారు. బుగ్గారం మండల అభివృద్ధికి మంత్రి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య, శేఖల్ల సర్పంచ్ పర్సా రమేష్, ఉప సర్పంచులు జంగ లావణ్య శ్రీనివాస్, నార్ల బుచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కోడిమ్యాల రాజన్న, నక్క గంగాధర్, మండల నాయకులు రెంటం శ్రీధర్, నంది తిరుపతి, బండారి మహేష్, దాసర్తి పోసన్న, కేలేటి పోసరాజు, గడ్డం నారాయణ, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>