12 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు!

కలం, నర్సాపూర్ (జి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నర్సాపూర్ (జి) మండలం సాయినగర్ తండా (Sainagar Thanda) ప్రాథమిక పాఠశాల ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 12 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వీరందరికీ బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడే ఉండడం గమనార్హం.

పాఠశాలలో ఒకటో తరగతిలో ఇద్దరు, రెండో తరగతిలో ఇద్దరు, మూడో తరగతిలో ఒకరు, నాలుగో తరగతిలో నలుగురు, ఐదో తరగతిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఒకే గదిలో పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇదే గ్రామానికి సమీపంలోని అంజనీ తండాలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు అవసరమైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్య అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>