తిరుమల శ్రీవారి సేవలో హీరో నితిన్

కలం, సినిమా: సినీ నటుడు నితిన్(Nithiin) మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తాను నటించిన తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నట్లు నితిన్ వెల్లడించారు. సినిమా మంచి విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ పరిసరాల్లో అభిమానులు నితిన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>