కలం, వెబ్ డెస్క్: శబరిమల (Sabarimala)లో అయ్యప్ప స్వామి వార్షిక మండల యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 8 నుంచి 10గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. తెల్లవారుజామున 3గంటలకు మండల యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి.
వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70వేల మందికి అనుమతి ఉంది. స్పాట్ బుకింగ్‌ను 20వేల మందికి పరిమితం చేశారు. అయినప్పటికీ బుకింగ్‌లు లేకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీని నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది. నీలక్కల్ దగ్గర వాహనాల రాకపోకలను అధికారులు కట్టుదిట్టం చేశారు.
పంబ నుంచి నీలక్కల్ వరకు KSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించనున్నారు. అదే రోజు ఆలయాన్ని మూసివేసి.. మరక విళక్కు యాత్ర కోసం డిసెంబర్ 30న తెరవనున్నారు. జనవరి 14న మకర విళక్కు ఉత్సవం జరుగుతుందని, జనవరి 30న ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని అధికారులు తెలిపారు.

