లింబో స్కేటింగ్‌లో సంచలనం.. శ్రిష్టి గిన్నిస్ రికార్డు!

కలం,వెబ్ డెస్క్ : భారత యువ స్కేటర్ శ్రిష్టి ధర్మేంద్ర శర్మ (Shrishti Dharmendra Sharma) లింబో స్కేటింగ్‌లో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కిందికి వంచిన పోల్స్ కింద నుంచి ఏమాత్రం తాకకుండా 50 మీటర్ల దూరాన్ని కేవలం 6.86 సెకన్లలోనే స్కేట్ చేస్తూ పూర్తి చేసి ఈ అరుదైన ఘనత సాధించింది.

వేగం, శరీర సమతుల్యత, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన శ్రిష్టిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>