ఇరాన్ బిగ్​ ప్లాన్​.. అమెరికాపై డర్టీ బాంబు దాడికి కుట్ర!

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా– ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ హెచ్చరికలు.. ఇరాన్​ ప్రతిస్పందనలు కలిసి రెండు దేశాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్​ పై అగ్రరాజ్యం సంచలన ఆరోపణలు చేసింది. ట్రంప్‌ పాలనలోని ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డర్టీ బాంబు​ దాడులకు (Iran Dirty Bomb Threat) పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

వాషింగ్టన్​ పై డర్టీ బాంబులు ప్రయోగించడానికి ఇరాన్​ ప్రణాళికలు సిద్దం (Iran Dirty Bomb Threat) చేస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో అమెరికా అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు. ఇరాన్​ చేసే ఏ దాడినైనా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైట్​ హౌస్​ అధికారి లారెన్​ బిస్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఇరాన్​ ఇలాంటి దాడులకు పాల్పడేందగకు సామర్థ్యం లేదని భద్రతా అధికారులు భావిస్తున్నారు.

డర్టీ బాంబు అంటే ఏంటి?

డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక పదార్థాన్ని వ్యాపింపజేయడానికి రూపొందించిన పేలుడు పరికరం. అణ్వాయుధంలా కాకుండా, ఇది అణు విచ్ఛిత్తి చర్యపై ఆధారపడి ఉండదు. డర్టీ బాంబ్ అణ్వాయుధం కంటే చాలా తక్కువ విధ్వంసకరమైనప్పటికీ, ఇది రేడియోధార్మిక పదార్థాన్ని వెదజల్లి చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేయగలదు. తద్వారా ప్రజారోగ్యం భద్రతాపరమైన ఆందోళనలకు కారణం అవుతుంది. అటువంటి పేలుడు వలన కలిగే తక్షణ ప్రాణనష్టం సాధారణంగా సంప్రదాయ పేలుడు వలనే సంభవిస్తుంది, అయితే రేడియోధార్మిక పదార్థం అదనపు కాలుష్య ప్రమాదాలను సృష్టిస్తుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>