HYD మెట్రో రెండో దశ.. రూ.275 కోట్ల నిధులు రిలీజ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) ప్రాజెక్టు రెండో దశ పనులకు నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులను మంజూరు చేసింది. రిలీజైన నిధుల్లో రూ.125 కోట్లు రుణ రూపంలో అందనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర రిలీజ్ చేసిన మొత్తం నిధుల్లో రూ.150 కోట్లు విస్తరణ పనుల కోసం కాగా.. మరో రూ.125 కోట్లు ప్రాజెక్టు రుణాల చెల్లింపునకు కేటాయించింది. సెకండ్ ఫేజ్ లో భాగంగా నగరంలో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24,269 కోట్లతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు గత ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది. సెకండ్ ఫేజ్‌లో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్, ఐటీ హబ్‌ పరిధిలోని రాయదుర్గం-కోకాపేట, పాతబస్తీ పరిధిలోని ఎంజీబీఎస్‌-చంద్రాయణగుట్టతో పాటు ఇతర శివారు ప్రాంతాలను కలిపే కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>