కలం, కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం కరీంనగర్ (Karimnagar) జిల్లా అధ్యక్షుడిగా ఎండి. ఉమర్ (MD Umar) నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బల్లికొండ తేజస్విని నియమితులయ్యారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ (Telangana Rakshana Sena) జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి అంకం శివరాణితో కలిసి హైదరాబాదులోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తన నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎండీ ఉమర్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha), పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా, నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుండి పోరాడతానని అన్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు తదితర విద్యారంగ సమస్యలపై నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ సిద్ధాంతాలను విద్యార్థి లోకంలోకి విస్తృతంగా తీసుకెళ్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ నియామకం పట్ల స్థానిక విద్యార్థి నాయకులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎండి. ఉమర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

