కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్ ముందస్తు వేడుకల్లో (కర్టెన్ రైజర్) ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో సీఎం సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, నూతన పారిశ్రామిక విధానాలు, ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)’ ప్రాజెక్టు ప్రాధాన్యతలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ సందర్భంగా వ్యాపార దిగ్గజాలను కోరనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII), ఇన్వెస్ట్ ఇండియా సంస్థల భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్వహిస్తోంది. రాబోయే డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న ప్రధాన గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వందలాది పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించే దిశగా ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది.
Also Read : డేటా సెంటర్ల దాహం.. సర్కార్ ముందు కొత్త సవాళ్లు!
Follow Us On: Youtube

