యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ

కలం, యాదగిరిగుట్ట: పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ ఐపీఎస్‌ ప్రత్యేక దృష్టి సారించారు. యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీలో భాగంగా జనరల్‌ డైరీ, ఇతర పోలీసు రికార్డులను పరిశీలించిన ఎస్పీ (SP Akshansh Yadav).. అనుమానిత వ్యక్తుల షీట్లు, రౌడీ షీట్ల నిర్వహణను తనిఖీ చేశారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతర నిఘా కొనసాగించాలని, శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, స్టేషన్‌ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యతని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో యాదాద్రి డివిజన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్ సీఐ శంకర్ గౌడ్, సీఐలు, ఎస్‌ఐలు యాదయ్య, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>