కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP ) ఆధ్వర్యంలో ఆదివాసీ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీం 86వ వర్ధంతి(Komaram Bheem 86th Death Anniversary)ని సోమవారం నిర్వహించారు. స్థానిక చైన్ గేట్ సమీపంలోని కొమరం భీం విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కొమరం భీం చూపిన పోరాట స్ఫూర్తి, ధైర్యం, త్యాగనిరతి నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమరం భీం ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ కన్వీనర్ గణేష్ నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆత్మరం దినేష్, రాము, రవి తదితరులు పాల్గొన్నారు.

