‘మన్‌ కీ బాత్‌’ వీక్షించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

కలం, వనపర్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ 139వ ఎపిసోడ్‌ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతూరి బుడ్డన్న (Kethuri Buddanna) వీక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రాంతంలో బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌ నివాసంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, నదుల పునరుజ్జీవనం, ఖాదీ ఉత్పత్తుల వినియోగం, డిజిటల్‌ వైద్య సేవల ప్రాముఖ్యత వంటి అంశాలపై చేసిన ప్రసంగాన్ని తిలకించారు.

స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధనకు సహకరించాలని మోదీ ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ-సంజీవని ద్వారా ప్రజలకు అందుతున్న టెలీ వైద్య సేవల ప్రాధాన్యాన్ని కూడా మోదీ వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌ గజరాజుల తిరుమలేష్‌, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కడమంచి శివ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>