కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో నాలుగు పరుగులకే ఔటైన వైభవ్ సూర్యవంశీకి మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) మద్దతుగా నిలిచాడు. అతడిని మూడో స్థానంలో ఆడించాలన్న టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ గాయంతో దూరం కావడంతో వైభవ్‌కు అవకాశం వచ్చింది. అయితే, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీని మార్చకుండా అతడిని మూడో స్థానంలో పంపించారు. ఈ క్రమంలో వైభవ్ ఎనిమిది బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులే చేశాడు.
ఒకటి రెండు ఇన్నింగ్స్‌లతో వైభవ్ సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదని కైఫ్ పేర్కొన్నాడు. జట్టు కూర్పును మార్చకుండా ఉండేందుకే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని వివరించాడు. టీ20ల్లో ఆటగాళ్లు అవసరాన్ని బట్టి వేర్వేరు స్థానాల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. వైభవ్‌కు మరిన్ని అవకాశాలు వచ్చినప్పుడు అతడి ఆటను అంచనా వేయాలని అభిప్రాయపడ్డాడు.

