కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్లో స్టార్ ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలకు ఒకే జట్టులో చోటు దక్కలేదు. మాజీ భారత క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఎంపిక చేసిన ఆల్‌టైమ్ ఇండియా టెస్ట్ జట్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న వెలువడిన కథనాల ప్రకారం, తనతో కలిసి అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్లో ఆడిన ఆటగాళ్లతోనే ఈ జట్టును ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్, నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్‌కు చోటిచ్చాడు. ఐదో స్థానంలో తన పేరునే చేర్చుకున్నాడు.
వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి కెప్టెన్ ధోనీయేనని, అందుకే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు కథనంలో పేర్కొన్నారు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకున్నాడు. పేస్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలకు చోటిచ్చాడు. అయితే, భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన కోహ్లీతో పాటు స్టార్ పేసర్ బుమ్రాను పక్కన పెట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రోహిత్ శర్మ కూడా ఈ జట్టులో లేడు.
రహానే ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు:
మురళీ విజయ్, శిఖర్ ధావన్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.

