కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా బలపడే నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ శాఖ హైఅలర్ట్ (IMD High Alert) ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా కోనసీమ మీదుగా కాకినాడ–నర్సాపురం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో కుంభవృష్ఠి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
తాజా వాతావరణ అంచనాల ప్రకారం, తుఫాన్ ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ (IMD High Alert) పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Also Read : యలహంక ప్యాలెస్ వివాదంలో కీలక మలుపు!
Follow Us On: Instagram

