కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల (Nelapatla) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాజేష్ (34) శనివారం రాత్రి చేపల వేట నిమిత్తం గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వారు వెంటనే అప్రమత్తమై రాజేష్ కోసం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం చెరువు గట్టుపై రాజేష్ చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి చెరువులో గాలించగా, నీటిలో విగతజీవిగా పడి ఉన్న ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం అందుకున్న కూసుమంచి (Kusumanchi) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో నేలపట్ల (Nelapatla) గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : కాంగ్రెస్ పాలనలో కరువు పరిస్థితులు : జగదీష్ రెడ్డి
Follow Us On: X(Twitter)

