బ్యాంకాక్ టు వైజాగ్.. భారీగా గంజాయి పట్టివేత

కలం, వెబ్ డెస్క్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport)లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వస్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా.. అతడి వద్ద సుమారు రూ.4 కోట్ల విలువైన నాలుగు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు బ్యాంకాక్‌లో కొనుగోలు చేసి సింగపూర్ మీదుగా వైజాగ్ తరలించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన డీఆర్ఐ అధికారులు.. ఎయిర్ పోర్టులోకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్టులో ఇంత విలువైన గంజాయి లభించడం ఇదే మొదటిసారి.

Also Read : వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మురళీ కార్తీక్ ఫైర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>