కలం, వెబ్ డెస్క్ : రష్యా-ఉక్రెయిన్ (Russia – Ukraine) మధ్య ఎట్టకేలకు శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. ఇరు దేశాలూ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన ఒలెష్కీలో ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ అనూహ్య పరిణామం వెనుక అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) దౌత్య చొరవ ఉండటం గమనార్హం. ఆమె చేసిన రాయబార ప్రయత్నాల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ మెలానియాపై ప్రశంసల వర్షం కురిపించారు. “మా నిపుణుల కంటే మెలానియానే (Melania Trump) ఈ విషయంలో బాగా పనిచేస్తోంది” అంటూ ఆమె దౌత్య నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. చాలాకాలంగా నడుస్తున్న ఈ ఘర్షణలో ఈ తాత్కాలిక విరమణ ఎలాంటి మార్పులు తెస్తుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
Also Read : సైబర్ దాడి.. స్తంభించిన TG-iPASS పోర్టల్!
Follow Us On : WhatsApp

