నర్సంపేటలో ఘోర అగ్నిప్రమాదం.. రెండు షాపులు దగ్ధం!

కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేట ( Narsampet Fire)  పట్టణంలోని ప్రధాన వ్యాపార ప్రాంతమైన నెహ్రూ సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని హకా ఫార్మర్ సెంటర్‌కు చెందిన స్ప్రే పంపుల విక్రయ దుకాణంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన ఈ దట్టమైన మంటల ధాటికి ప్రక్కనే ఉన్న మరొక షాపు కూడా అగ్నికి ఆహుతైంది. దీంతో కాంప్లెక్స్ లోని రెండు షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో షాపులోని వస్తువులు, స్ప్రే పంపులు పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వ్యాపారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం అంచనాపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>