తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు.. జాబితా సిద్ధం!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ముగిసిన వెంటనే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు (Telangana IAS Transfers) జరగనున్నాయి. కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5 నాటికి ‘సర్’ ప్రక్రియ ముగియనున్నది. అదే నెల 9న తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విడుదల చేయనున్నది.

ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈలోగా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతల అప్పగించడం ఉండొచ్చని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు జరగబోయే బదిలీలు ఎన్నికల టీమ్‌గానే ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. త్వరలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటు గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ బదిలీలు ఉండనున్నాయి.

కలెక్టర్లు మొదలు కార్యదర్శుల వరకు..

ఈసారి జరిగే ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కలెక్టర్ మొదలు పలు విభాగాల కార్యదర్శుల వరకు పేర్లు ఉంటాయన్నది సెక్రటేరియెట్ వర్గాల సమాచారం. కొందరు ఆఫీసర్లు రెండేండ్లకు పైగా ఒకే ప్లేస్‌లో పని చేస్తున్నారు. వీరి బదిలీ తప్పనిసరి కానున్నది. ఐపీఎస్ ఆఫీసర్ల విషయంలోనూ జిల్లాల ఎస్పీలు మొదలు ఐజీ ర్యాంకు వరకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫర్లు ఉండొచ్చని తెలిసింది.

రాబోయే వారం రోజుల పాటు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండనున్నందున ఫస్ట్ వీక్‌లో ఒక దఫా సమావేశం సీనియర్ అధికారులతో ఉండొచ్చని, దానికి అనుగుణంగా ముసాయిదా జాబితా రూపొందుతుందని, ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో బదిలీ అయ్యే అధికారుల తుది జాబితా ఖరారయ్యే అవకాశమున్నది. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాలు, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంచనాతో బదిలీల జాబితా రూపొందనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>