రాష్ట్రస్థాయి పోటీలకు నిర్మల్ జట్టు ఎంపిక

కలం, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్‌ -17 క్రికెట్ టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌లో నిర్మల్ (Nirmal) జిల్లా జట్టు విజయం సాధించింది. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్‌లోని నిర్మల్ క్రికెట్ అకాడమీ మైదానంలో శనివారం నిర్వహించిన పోటీల్లో నిర్మల్ జట్టు మూడు జిల్లాల జట్లపై గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అండర్‌ -17 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.

ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు గద్వాల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో నిర్మల్ (Nirmal) జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు వెళ్లనుండటంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు సుదర్శన్ కోచ్‌గా వ్యవహరించగా, కార్యదర్శి లక్ష్మణ్‌, ఎం. శ్రీనివాస్, రమణారావు, రమణ, బుచ్చి రామారావు, వన్నెల భూమన్న, రాష్ట్రపాల్ సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>