పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలి: డీఎస్పీ

కలం, నిర్మల్‌: పోలీస్‌ సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ (Nirmal DSP Srinivas) అన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం పోలీస్‌ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు.

ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్​ (Nirmal DSP) సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. పోలీస్‌ సిబ్బంది వ్యక్తిగతంగా లేదా విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>