కలం, కరీంనగర్: కరీంనగర్ లయన్స్ క్లబ్ (Karimnagar Lions Club) ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం మంకమ్మతోట పరమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో ప్రారంభమైంది. ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ మోరా భద్రేశం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. చిదుర సురేష్, వల్లా కృష్ణ హరి, కొల్లూరి ఆనందం, పరమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఛైర్మన్ ప్రసాద్ రావు, సింగంరాజు, శంకర్ ప్రసాద్ రెడ్డి, ముక్క శరత్ కృష్ణ, కొండపల్లి రేణుక హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు మైదం శివకాంత్ నాయకత్వాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన క్లబ్ కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మెతుకు చైతన్యను ప్రశంసించారు.

