నిజామాబాద్ అభివృద్ధిపై సీఎంతో పీసీసీ చీఫ్ చర్చ

కలం, నిజామాబాద్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో టీపీసీసీ అధ్యక్షులు (TPCC Chief), ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి సమీక్షించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మాదవనగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని నేతలు వివరించారు. నేతల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదవనగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

Also Read : ట్రై సిరీస్‌లో అఫ్ఘాన్ పైకి.. ఇంగ్లండ్ కిందకి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>