కలిసికట్టుగా కరువును ఎదుర్కోవాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో ముంచుకొస్తున్న కరువు ముప్పును కలిసికట్టుగా ఎదుర్కోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) పిలుపునిచ్చారు. శనివారం ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని.. వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు గ్రామసభలు నిర్వహించి, పంటల ఎంపిక, సాగు విధానాల విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

తీవ్రంగా విద్యుత్ కొరత..

రానున్న రోజుల్లో విద్యుత్ సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించి, విద్యుత్ వృథాను అరికట్టేలా చూడాలన్నారు. సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై.శశికళ, మండల తహసీల్దార్ సురేష్, ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి, సర్పంచుల ఫోరం ఛైర్మన్ మామిడి రాజు, గ్రామాల సర్పంచులు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>