సున్నం చెరువు ప‌రిస‌రాల్లో అక్ర‌మ బోర్ల తొల‌గింపు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్ నినో వేళ నీటి పొదుపుపై ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతుంటే కొంద‌రు అక్ర‌మార్కులు అడ్డ‌దారిన ఏర్పాటు చేసుకున్న బోర్ల‌తో నీళ్ల దందాకు తెర‌లేపారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు (Sunnam Cheruvu) ప‌రిధిలో అక్ర‌మ బోర్ల‌తో జ‌రుగుతున్న నీళ్ల దందాపై హైడ్రా (HYDRAA) స్టింగ్ ఆప‌రేష‌న్‌ చేప‌ట్టింది. శ‌నివారం ఉద‌యం అధికారులు ప‌లు బోర్ల‌ను గుర్తించి తొలగించారు. సున్నం చెరువు ప‌రిస‌రాల్లో ఇళ్ల‌ల్లో ప‌లు చోట్ల అక్ర‌మంగా బోర్ల‌ను ఏర్పాటు చేసి నీటిని వాణిజ్య అవ‌స‌రాల‌కు త‌ర‌లిస్తూ, సొమ్ము చేసుకుంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో స్థానికంగా జేసీబీల‌తో ఇళ్ల‌ల్లో నుంచి బోర్ల పైపుల‌ను తొల‌గించారు. భారీ పోలీసు బందోబ‌స్తు స‌మ‌క్షంలో ఈ ఆప‌రేష‌న్ కొన‌సాగింది.

గ‌తంలో 50 నుంచి 60 అడుగుల లోతులో బోరు వేస్తే నీళ్లు వ‌చ్చేవ‌ని, ఇప్పుడు 600 అడుగుల వ‌ర‌కు బోర్లు వేస్తున్నా నీళ్లు రావ‌డం లేద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సున్నం చెరువు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయాయ‌య‌ని, నీటి స‌మ‌స్య తీవ్ర రూపం దాల్చుతోంద‌ని అధికారుల‌కు గోడు వెళ్ల‌బోసుకున్నారు. న‌గరంలో ఎంతో ప్ర‌జ‌లు డ‌బ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో ఇలా అక్ర‌మంగా నీటితో వ్యాపారం చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>