ప్రభుత్వ బాలుర వసతి గృహం తనిఖీ చేసిన ఎంపీడీవో

కలం, సోన్ : సోన్ మండల (Soan Mandal) కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో కట్కం రామకృష్ణ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతాన్ని పరిశీలించారు. వంటగది, విద్యార్థుల గదులను సందర్శించి వసతి గృహంలో అందుతున్న సౌకర్యాల గురించి హాస్టల్​ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల సంక్షేమం, వసతి గృహం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ రాథోడ్‌ అర్చన తదితరులు పాల్గొన్నారు.

Also Read : మ‌రో వివాదంలో చిక్కుకున్న “ఇడుపుకాయితం”!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>