కలం, ఉట్నూర్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. ఉట్నూర్ (Utnoor) మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కష్టపడి చదువుకుని, లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు అండగా నిలవడంతో పాటు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల కట్టడికి ఈగల్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే (Vedma Bojju) తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపించి, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువతలో చైతన్యం కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : రేపు ముంబైకి సీఎం రేవంత్.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

