కలం, వెబ్ డెస్క్ : భారత్‌లో అనేక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ (Himanshu Bhau) అమెరికాలో చిక్కాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హిమాన్షు భౌపై హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల (ఎక్స్‌టార్షన్) వంటి అనేక కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీ, హర్యానా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ నేరస్థుడిపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది. భారత్ నుంచి తప్పించుకున్న తర్వాత పోర్చుగల్ కేంద్రంగా తన గ్యాంగ్ కార్యకలాపాలను నడిపించిన హిమాన్షు, ఆపై అమెరికాకు మకాం మార్చాడు. విదేశాల్లో తలదాచుకుంటూనే వర్చువల్ నంబర్లు, సోషల్ మీడియా వేదికగా భారత్‌లోని వ్యాపారులను బెదిరిస్తూ దందాలు సాగించేవాడు. అమెరికాలో ఎఫ్‌బీఐ అతడిని అరెస్ట్ చేయడంతో, భారత దర్యాప్తు సంస్థలు అతడిని స్వదేశానికి రప్పించేందుకు కసరత్తు వేగవంతం చేశాయి.
Also Read : మలేషియా ఫ్లైట్.. ట్రాలీ బ్యాగ్‌లో కోట్ల విదేశీ నోట్లు!
Follow Us On: X(Twitter)

