అమ్మ‌వారి ముక్కు పుడ‌క‌కు రికార్డు వేలం!

కలం, అచ్చంపేట: అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి (Bommanpally) గ్రామంలో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి ఆభరణాలు, అలంకరణ వస్తువులు భారీ ధరలకు దక్కించుకోవడం విశేషం. అమ్మవారి రెండు తులాల ముక్కుపుడకను రూ.8,61,000కు ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామానికి చెందిన కట్ట మైసమ్మ దేవాలయ చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్ వేలంలో దక్కించుకున్నారు. అదేవిధంగా అమ్మవారి వెండి విగ్రహాలను సైతం భక్తులు పోటీపడి వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేలంలో పాల్గొని అమ్మవారి ఆభరణాలను దక్కించుకున్న భక్తులందరికీ గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

అమ్మవారి అలంకరణ, వస్త్రాల వేలం వివరాలు

1. బాలాత్రిపుర సుందరి దేవి – గంట మల్లయ్య: రూ.36,000
2. గాయత్రీ దేవి – వడ్లకొండ సంజయ్: రూ.37,000
3. అన్నపూర్ణాదేవి – కడారి రామకృష్ణ: రూ.44,000
4. మహా చండీ దేవి – కడారి వెంకయ్య: రూ.40,000
5. లలితా త్రిపుర సుందరి – పోడేండ్ల వీరయ్య: రూ.40,000
6. సరస్వతీ దేవి – కడారి వెంకటయ్య: రూ.42,000
7. మహాలక్ష్మీ దేవి – నూకం ప్రసాద్ (డిండి): రూ.75,000
8. దుర్గాదేవి – కనకటి వెంకటయ్య: రూ.91,000
9. మహిషాసుర మర్దిని దేవి – ఉడుత విష్ణు: రూ.67,000
10. రాజరాజేశ్వరి దేవి – మల్‌రెడ్డి మల్లికార్జున్ రెడ్డి (ఐనోలు): రూ.85,000

వెండి విగ్రహాల వేలం వివరాలు

1. అమ్మవారి 15 తులాల వెండి విగ్రహం – కనకటి రాజేందర్: రూ.1,20,000
2. అమ్మవారి 5 తులాల వెండి విగ్రహం – జమాల్‌పూర్ హుస్సేన్: రూ.61,000
3. అమ్మవారి 4 తులాల వెండి విగ్రహం – బిక్కుమాండ్ల రంగయ్య: రూ.71,000

భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జిల్లాలోనే అత్యధిక స్థాయిలో భక్తులు వేలంపాటలో పాల్గొని అమ్మవారి ఆభరణాలు, వస్త్రాలు, వెండి విగ్రహాలను దక్కించుకోవడం బొమ్మన్‌పల్లి దసరా ఉత్సవాల ప్రత్యేకతగా నిలిచింది. గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంపై దుర్గామాత కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>