కాలువలో జారిపడి వ్యక్తి మృతి

కలం, జోగులాంబ గద్వాల: ​జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అమరచింత (Amarachintha) పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన శ్యామ్ (38) కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం జూరాల ప్రాజెక్టు పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో శ్యామ్ జూరాల ఎడమ కాలువ వద్ద ప్రమాదవశాత్తు జారి కాలువలో పడాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ​మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై అమరచింత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గద్వాలకు చెందిన కీర్తనతో అనంతరపురానికి చెందిన శ్యామ్‌కు కొన్నేళ్ల క్రిత‌మే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>