కలం, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే (Prabhas Birthday) సందర్భంగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ స్పిరిట్ (Spirit) షూటింగ్ సెట్స్‌కు ఫోటోను సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో సందీప్ రెడ్డి వంగా ఒక బాటిల్ ఓపెన్ చేస్తుండగా… ప్రభాస్ సరదాగా పక్కనే నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ క్యాజువల్, ఫన్ మూమెంట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి, ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వచ్చే దీపావళి కానుకగా 2027 అక్టోబర్ 29న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజా పిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేయడంతో, ఫ్యాన్స్ తదుపరి అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : అనిరుధ్ పెళ్లి.. జోనితా గాంధీ సాడ్ పోస్టులు!
Follow Us On: Youtube

