కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈసారి కేసీఆర్ తెలంగాణ మాత్రమే కాదు.. దేశ స్థాయిలో కూడా అత్యంత ప్రభావం చూపబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ కేంద్రంలో చక్రం తిప్పబోతుందన్నారు. దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బీజేపీ ఒక వైపు.. ఏమాత్రం ఎజెండా లేని కాంగ్రెస్ మరోవైపు.. గతంలో కేసీఆర్ చెప్పిందే భవిష్యత్తులో నిజం కాబోతుందన్నారు. రాహుల్ గాంధీని ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదన్నారు.

పడిపోయిన బీజేపీ గ్రాఫ్..

కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైందని, అందుకే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పేరుతో దేశ యువత ఉద్యమిస్తోందని కేటీఆర్ (KTR) అన్నారు. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని.. ఆ పార్టీ గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా బలహీనంగా మారిందన్నారు. ఆ పార్టీ రాజకీయ నాయకులను భయటపెట్టొచ్చు కానీ, యువతను భయపెట్టలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని.. ఆ విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్, తనను తిట్టడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ నేతలే కూలగొట్టారు..

కేసీఆర్‌ను గెలిపించుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ నేతలే మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ని కూలగొట్టారు తప్ప తనంతట తానుగా కూలిపోలేదని కుండబద్దలు కొట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.. ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలను గెలుస్తుందన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసినందుకు నిరుద్యోగులు గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Also Read : పట్టభద్రుల ఎమ్మెల్సీ.. సీపీఐ మద్దతు కోరాం: TPCC చీఫ్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>