కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నేడు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ లాంచ్(Trailer Launch) ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సూరారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా(Aadarsha Kutumbam)లో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read : అనిరుధ్ పెళ్లి.. జోనితా గాంధీ సాడ్ పోస్టులు!
Follow Us On: Youtube

