ఎండిన పొలంలోనే బైక్‌తో యువరైతు వినూత్న నిరసన!

కలం, భూపాలపల్లి : చేతికొచ్చిన వరి పంట కళ్లముందే ఎండిపోవడంతో ఓ యువరైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. సాగునీరు, విద్యుత్‌ సకాలంలో అందక మూడెకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎండిన పొలంలోనే ద్విచక్ర వాహనంతో (Farmer Bike Protest) చక్కర్లు కొట్టాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌ ఈ నిరసనకు దిగాడు. నీళ్లు, కరెంట్ లేక వరి పంట ఎండిపోయిందని ప్రవీణ్ వాపోయాడు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంతోపాటు, పంట నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ ఘటన అద్దం పడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>