ఏపీ స్థానిక ఎన్నికలు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఇచ్చి నామినేషన్లు వేయించాలని కోరితే అధికారులు కూడా సహకరించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని జగన్ నిలదీశారు. గత ఐదు నెలల్లో ప్రజలకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే నామినేషన్లను అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ప్రజల తీర్పును బుల్డోజ్ చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై అన్ని ఆధారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)తో పాటు గవర్నర్‌కు సమర్పించామని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన తెలిపారు.

స్థానిక ఎన్నికల వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని జగన్ పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రక్రియను వాయిదా వేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. నామినేషన్లు వేసే ప్రతి అభ్యర్థికి పూర్తి రక్షణ కల్పించడంతో పాటు, బందోబస్తు ఏర్పాటు చేయాలని మరియు నామినేషన్ల ప్రక్రియ మొత్తాన్ని సీసీ టీవీ రికార్డింగ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>