ప్రగతికి రక్షణగా తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం: భట్టి విక్రమార్క

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. భద్రతే అభివృద్ధికి పునాది అని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్ర ప్రగతిలో TGSPF పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. “ప్రగతికి రక్షణ” అనే నినాదం ఎంతో అర్థవంతమైనదని వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సెక్యూరిటీ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీలో 36వ రైజింగ్ డే పరేడ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 36వ బ్యాచ్ టీజీఎస్‌పీఎఫ్ దళాల నుంచి డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం దాదాపు 2 వేల మంది సిబ్బందితో రాష్ట్రంలోని 67 కీలక ప్రభుత్వ సంస్థలకు ఈ దళం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ముఖ్యంగా యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి వంటి ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల భద్రతలో TGSPF సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అమీన్‌పూర్‌లోని ప్రత్యేక శిక్షణ అకాడమీ ద్వారా సిబ్బందికి మెరుగైన శిక్షణ అందుతుండటం సంతోషకరమని అన్నారు.

డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ సాంకేతికత వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణ, నిజాయితీ ఎంతో అవసరమని చెప్పారు. భద్రతా సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) భరోసా ఇచ్చారు.

Also Read : ఎండిన పొలంలోనే బైక్‌తో యువరైతు వినూత్న నిరసన!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>