కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక (Redla Repaka) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన కొండం శంకరయ్య గౌడ్ శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కగా, అనుకోకుండా పైనుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న గీత కార్మిక సంఘం నాయకుడు మాద శంకర్ గౌడ్ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాద శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కుటుంబానికి తగిన పరిహారం అందించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ప్రగతికి రక్షణగా తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం: భట్టి విక్రమార్క
Follow Us On: X(Twitter)

