జోగి మేఘన కారు ప్రమాదం.. మాజీ మంత్రిపై అనుమానం!

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన (Jogi Meghana) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ నుంచి కోదాడకు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొనగా, వాహనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటన సాధారణ ప్రమాదం కాదని, దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉండి ఉండవచ్చని మేఘన తండ్రి కృష్ణ ఆరోపణలు చేశారు.

తన కూతురు మేఘనతో కలిసి ఈ నెల 15న ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు ప్రాణహాని ఉన్నందున దీనిపై లోతైన విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే మేఘన తన భర్త రాజీవ్, మామ జోగి రమేష్, ఇతర కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, వరకట్న వేధింపుల ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఈ పాత వివాదాల నేపథ్యంలోనే ఈ కారు ప్రమాదం వెనుక జోగి రమేష్ హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తూ మేఘన తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>