శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport ) ఎయిర్‌ ఇండియా విమానానికి (Air India Flight) ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి ముంబయికి 109 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ417 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ అప్రమత్తమయ్యారు. విమానం టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే సమస్యను గుర్తించి, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

పైలట్‌ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, లోపానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కారమైన తర్వాతే విమానాన్ని తిరిగి నడిపించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>