కలం, సినిమా: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ వరుస క్రేజీ అప్డేట్లతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇందులో భాగంగానే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర బృందం ‘భైరవ ఈజ్ బ్యాక్’ అంటూ విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో విపరీతమైన జోష్ నింపుతోంది.
ఇది కేవలం ఆరంభం మాత్రమేనంటూ, ప్రభాస్ బర్త్‌డే ట్రీట్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్తూ ఆయన నటిస్తున్న మరో భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి “డీక్లాసిఫైయింగ్ ఫైల్ నెం: 025” పేరుతో మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఈ అప్డేట్ను అందించాయి. 1940ల నాటి బ్రిటిష్ కాలంనాటి వాతావరణం, “ఎ బటాలియన్ హూ ఫైట్స్ అలోన్”అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
ఒకే రోజు రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ల నుంచి అదిరిపోయే అప్డేట్స్ రావడంతో రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం నెట్టింట ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ట్యాగ్లు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఒకవైపు ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో భైరవ అల్లకల్లోలం, మరోవైపు 1940ల నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ‘ఫౌజీ’ లుక్.. ఇలా రెండు పూర్తిగా భిన్నమైన జోనర్లలో ప్రభాస్ చూపించబోతున్న వైవిధ్యం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాదు సందీప్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి కూడా బర్త్ డే సందర్భంగా అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

