కొత్తగూడెంలో ఘనంగా ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో (Kothagudem Police) డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థుల కోసం ఆన్‌లైన్, నేరుగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పోలీస్ శాఖ పనితీరును దగ్గరగా పరిశీలించారు.

​షీ టీమ్స్, భరోసా కేంద్రం, ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాల ద్వారా మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. అలాగే క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ మరియు కమ్యూనికేషన్ విభాగాలు నేర పరిశోధనలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరికరాలను విద్యార్థులకు ప్రదర్శించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని అధికారులు సూచించారు.

కాగా, ​ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో వినియోగించే సాంకేతిక పరికరాలు, భద్రతా చర్యలను నేరుగా తెలుసుకునే అవకాశం దక్కిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>