క‌రెంట్ షాక్‌తో యువ రైతు మృతి

కలం, జోగులాంబ‌ గద్వాల: ​కేటిదొడ్డి ​(KT Doddi) మండల కేంద్రానికి చెందిన పిల్లి వీరన్న (27) అనే యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ​స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం తెల్లవారుజామున పిల్లి వీరన్న గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ పొలానికి నీరు పారబెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో వ్యవసాయ మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో, ట్రాన్స్ఫఫార్మర్ వద్ద చెక్ చేసేందుకు వెళ్లగా ఎర్త్ కావడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వీరన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

​మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన వీర‌న్న‌ విద్యుత్ షాక్‌తో అకాల మరణం చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం‌ తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు, నాయకులు ఉరుకుందు, గ్రామ సర్పంచ్ నారాయణ, తదితరులు గద్వాల జిల్లా ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. కేటిదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>